క్రైమ్/లీగల్

వేధింపుల కొడుకును హతమార్చిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మార్చి 1: ఎదిగివచ్చిన కుమారుడు కుటుంబానికి చేయూతనందించాల్సి ఉండగా మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధిస్తుండడంతో వేధింపులు తాళలేక కొడుకును రోకలిబండతో తలపై మోది తండ్రి హతమార్చిన సంఘటన జిల్లాకేంద్రమైన సూర్యాపేటలో శనివారం అర్ధరాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం జిల్లాకేంద్రంలోని శ్రీరానగర్‌కాలనీలో తంగెళ్ల రామస్వామి అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటూ హెయర్‌కటింగ్ సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. అతనికి కుమార్తె, కుమారుడు ఉండగా కొనేళ్ల క్రితం కుమార్తెకు వివాహం జరిపించారు. కాగా రామస్వామి కుమారుడు తంగెళ్ల నరేష్ (28) గత కొనేళ్ల నుండి మద్యానికి బానిసయ్యడు. అప్పటి నుండి తల్లిదండ్రులను తరుచూ వేధిస్త్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ నిత్యం ఘర్షణ పడుతుండేవాడు. దీంతో రామస్వామి భార్య సైతం కుటుంబ పోషణ కోసం బాలికల హస్టల్‌లో వంట మనిషిగా పనిచేసేది. శనివారం నరేష్ ఇంటి నుండి వెళ్లి అతిగా మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఈక్రమంలో తల్లిదండ్రులతో గొడవపడి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వారిపై దాడికి యత్నించాడు. ఈక్రమంలో తండ్రి ఆత్మరక్షణ కోసం తన చేతికి అందిన రోకలిబండతో కుమారుడు నరేష్ తలపై కొట్టడంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ తెలిపారు.

*చిత్రం... *తండ్రి చేతిలో హతమైన కుమారుడు నరేష్