క్రైమ్/లీగల్

ఏటీఎం సెంటర్‌లో చోరీకి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 2: ఏటీఎం సెంటర్‌లో ఓ దుండగుడు చోరీకి యత్నించిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుందిగల్ ఏఎస్‌ఐ వేణుగోపాల్ పెట్రోలింగ్ వాహనంలో డ్రైవర్ బ్రహ్మయ్యతో కలిసి సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో సూరారంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సూరారంలోని ఆక్సిస్ ఏటీఎం సెంటర్‌లో ఓ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా నిందితుడు పారిపోవడానికి యత్నించాడు. సెంటర్‌లోని పై కవర్ పగులగొట్టి ఉన్నాయి. నిందితున్ని పట్టుకుని పీఎస్‌కు తరలించారు. నిందితుడు రమేశ్ (30) అని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.