క్రైమ్/లీగల్

మహారాష్ట్ర లో రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, మార్చి 2: మహారాష్ట్ర లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పూణెకు 85 కిలోమీటర్ల దూరంలోని రాయగఢ్ జిల్లాలో రోడ్డు పక్కన నిల్చున్న వారి మీదుగా ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఖొపొలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దస్తూరి గ్రామం వద్ద ముంబయి - పూణె పాత జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. ఖొపొలి పోలీసుల కథనం మేరకు.. పొరుగున ఉన్న పూణె జిల్లా తలెగాం దభాదె గ్రామానికి చెందిన ఆరు వ్యక్తులు రాత్రి పొద్దుపోయిన తరువాత మూడు మోటార్ సైకిళ్లపై బయల్దేరారు. మధ్యలో 11 గంటలు దాటిన తరువాత మూత్ర విసర్జన కోసం ఆపాల్సిందిగా తోటివారిని ఓ వ్యక్తి కోరడంతో రాయ్‌గఢ్ సమీపంలోని అలీబాగ్ వద్ద మోటార్ సైకిళ్లను ఆపారు. మూత్ర విసర్జనకు రోడ్డు కిందకి అతను వెళ్లగా మిగిలిన ఐదుగురు రోడ్డు పక్కన నిల్చొన్నారు. ఈలోగా ఖొపొలి వైపు పిండి బస్తాలతో వస్తున్న ట్రక్కును మలుపు తిప్పే క్రమంలో అదుపుతప్పి ఐదుగురి మీదుగా దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కన నిల్చొన్న ఐదుగురు వ్యక్తులూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలినట్లు పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ విలేఖరులకు చెప్పారు. మృతులను ప్రదీప్ చోలె (38), అమోల్ చిలమె (30), నారాయణ్ గుందేల్ (28), గోవింద్ నల్వాద్, నివృత్తు గుందేల్‌గా పోలీసులు గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడనీ.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఖొపొలి పోలీసులు స్పష్టం చేశారు.