క్రైమ్/లీగల్

మెట్రో స్టేషన్ వద్ద గంజాయి విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 3: గంజాయిని విక్రయిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద రూ.1.6లక్షల విలువైన 16 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గంగవరం జీకే వీధి వాసులు పంగి నాగేశ్వర్ రావు (22), సుర్లపాలెం జీ.మాడ్గులకు చెందిన మువ్వల ప్రసాద్ (21) గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. మత్తుకు అలవాటు పడ్డ విద్యార్థులను కలుస్తూ గంజాయిని విక్రయిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, సిబ్బందితో వెళ్లి పై ఇద్దరిని చాకచక్యంగా పట్టుకుని మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు.