క్రైమ్/లీగల్

ఫడ్నవీస్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచినందుకుగాను విచారణ ఎదుర్కోవాలంటూ గత ఏడాది ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ ఆయన దాఖలు చేసిన విషయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. గత ఏడాది అక్టోబర్ 1న సైతం బాంబే హైకోర్టు దేవేంద్ర ఫడ్నవిస్‌కు క్లీన్ చిట్ ఇస్తూ ఆయన ఆర్‌పీఏ చట్టాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు కలిగిన బెంచ్ తాజాగా దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత ఏడాది అక్టోబర్ 1న వచ్చిన సతీష్ ఊకే అనే వ్యక్తి దీనిపై పునఃసమీక్షించాలని మళ్లీ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అప్పట్లో దేవేంద్ర ఫడ్నవీస్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్‌తగి వాదించారు. అయితే, దేవేంద్ర ఫడ్నవీస్ 2014 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని పేర్కొన్నారంటూ నాగ్‌పూర్ మెజిస్టీరియల్ కోర్టులో సతీష్ ఊకే క్రిమినల్ కేసు దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును మళ్లీ పునఃసమీక్షించాలని కోరుతూ దేవేంద్ర ఫడ్నవీస్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కేసును ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

*చిత్రం... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌