క్రైమ్/లీగల్

ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మంగళవారం ఎసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బును అందజేస్తూ రేవంత్‌రెడ్డి దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులు అంతా ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.

ఉగ్రవాది తుండాపై ఆరోపణలు కొట్టివేత
ఉగ్రవాది అబ్దుల్ కరీంపై ఆరోపణలను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ పేలుళ్ల కేసులో పోలీసులు ఉగ్రవాది అబ్దుల్ కరీంను నిందితుడిగా పేర్కొన్నారు. అయితే, సుదీర్ఘకాలం పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కేసును నాంపల్లి కోర్టు విచారించింది. పేలుళ్ల కేసులో తుండాను నిర్దోషిగా ప్రకటించింది. 1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడని తుండాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, అందుకు తగ్గ ఆధారాలను పోలీసులు సమర్పించలేదని న్యాయస్థానం పేర్కొంది.
భైంసా దాడులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
భైంసాలో హిందువులపై జరిగిన దాడిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు న్యాయవాది కే కరుణాసాగర్ తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ నిర్మల్ ఎస్పీకి, నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేస్తూ 8 వారాల్లోగా పునరావాసం, రక్షణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని కరుణాసాగర్ చెప్పారు.