క్రైమ్/లీగల్

ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: సచివాలయం కూల్చివేత వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ అనిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం విధాన నిర్ణయాలను తీసుకున్నపుడు అవి చట్టబద్ధంగా, సహేతుకంగా ఉన్నపుడు ఆ అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆయన చదివి వినిపించారు. ప్రస్తుత సచివాలయ భవనాలు మరమ్మతులకు వీలు లేకుండా ఉన్నాయని, కొత్తవి నిర్మించాలని నలుగురు ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇంజనీర్ల కమిటీ ఆధారంగానే నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసిందని ఏజీ పేర్కొనగా, ఇంజనీర్ల కమిటీ ప్రభుత్వం చెప్పినట్టే నివేదిక ఇస్తుందని పిటిషనర్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరఫున న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. ప్రభుత్వ ఆదేశాలతో నిపుణుల కమిటీ వారికి కావల్సినట్టే నివేదిక ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. సచివాలయం యథాతథ స్థితిని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు స్వతంత్ర కమిటీని నియమించాలని న్యాయస్థానాన్ని కోరారు. భవనాల మరమ్మతులకు, విద్యుత్ సౌకర్యానికి, అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అందుకు సంబంధించిన సాంకేతిక అంశాల జోలికి తాము పోలేమని, నిపుణుల కమిటీ నివేదికను తాము పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నివేదిక ఎంత వరకూ వాస్తవం అనే అంశాల జోలికి తాము వెళ్లమని ఆ పని తమది కాదని పేర్కొన్నారు. సాంకేతిక అంశాల జోలికి తామెలా వెళ్తామని, తాము సాంకేతిక నిపుణులం కాదని ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదుల వాదనలపై కౌంటర్ దాఖలుచేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఏకపక్ష నిర్ణయాలు తగదు
అధికారులు తాము ఏకపక్షంగా వ్యవహరిస్తామంటే తగదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో అధికారులు తమ పరిధిలోనే పనిచేయాలని, అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం ఎవరికీ లేదని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంపై పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్న హైకోర్టు తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.