క్రైమ్/లీగల్

గిరిజన బాలికలపై గ్యాంగ్ రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 3: ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం సంఘటన విశాఖ జిల్లా అరకులోయ మండలంలో సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధిత బాలికలలో ఒకరు మంగళవారం అరకులోయ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలిక ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని బొండాం పంచాయతీ రంపుడువలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన బాలికలు సోమవారం సాయంత్రం బహిర్భూమికని వెళ్తున్నప్పుడు అదే మార్గంలో వాహనంలో వెళుతున్న రేగ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు అరకు ఉత్సవ్‌కు తీసుకెళ్తామని నమ్మబలికారు. ఐదుగురు యువకులలో నలుగురు వాహనంలో ఉండగా, గొల్లూరి గోపి అనే యువకుడు బాలికలకు మాయమాటలు చెప్పి బలవంతంగా వాహనంలోకి ఎక్కించాడు. అరకు ఉత్సవ్ పేరిట వాహనంలో ఇద్దరు బాలికలను ఎక్కించిన వీరు సుంకరమెట్ట వైపునకు తీసుకెల్తుండడంతో అనుమానం వచ్చిన బాలికలు యువకులను నిలదీసారు. దీంతో యువకులు వాహనాన్ని కొత్త్భల్గుగుడ పంచాయతీ జనంగుడ గ్రామ సమీపంలోని శ్మశానవాటికకు చేరువలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి ఇద్దరు బాలికలపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న ఒక పాస్టర్ దీనిని గమనించి సంఘటన స్థలానికి చేరుకునేలోగా యువకులు పరారయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న పాస్టర్ సంఘటన స్థలం నుంచే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇచ్చిన సలహాతో బాధిత బాలికలను పాస్టర్ వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమార్తెల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుతో స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పైడయ్య, ఎస్‌ఐ అరుణ్‌కుమార్ మంగళవారం మధ్యాహ్నం సంఘటన స్థలాన్ని పరిశీలించి అత్యాచారానికి సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరించారు. కాగా ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం చేసిన ఐదుగురు యువకులలో గొల్లోరి గోపి అనే యువకుడితో పాటు వాహన డ్రైవర్ హరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా అత్యాచారానికి గురైన బాలికలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐద్వా నాయకురాలు వీవీ జయ మంగళవారం సాయంత్రం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసారు.