క్రైమ్/లీగల్

గాంధీ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, మార్చి 4: సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి బుధవారం ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ రావు(53) ఆసుపత్రిలోని రెండవ అంతస్తు నుంచి అకస్మాత్తుగా కిందకు దూకటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాంధీ ఆసుపత్రికి కోవిడ్ వైరస్ అనుమానిత బాధితుల సంఖ్య పెరిగిపోవటంతో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, దూకిన వ్యక్తిని అత్యవసర విభాగానికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించారు. అతని మానసిక పరిస్థితి బాగాలేక, ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా, అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.