క్రైమ్/లీగల్

ఏటీఎం ధ్వంసం చేసి నగదు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, మార్చి 4: ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును అపహరించిన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ మదర్ డెయిరీ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం సెక్యూర్‌వాల్యు సిబ్బంది రూ.5.50లక్షలు జమచేసి వెళ్లారు. అప్పటికే అందులో కొంత నగదు ఉన్నట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి 1.50గంటల సమయంలో ఏటీయం నుంచి రూ.200విత్‌డ్రా చేశారని తెలిపారు. అప్పటికీ ఏటీఎంలో రూ. 6.37లక్షలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం గుర్తుతెలియని దుండగులు చొరబడి మిషన్‌ను గ్యాస్ వెల్డింగ్ ద్వారా కట్‌చేసి అందులో ఉన్న మొత్తం నగదును దోచుకెళ్లారని తెలిపారు. బ్యాంక్ ఏజీఎస్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.