క్రైమ్/లీగల్

కరోనా నియంత్రణపై హైకోర్టు అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: కరోనా వైరస్ నివారణలో అధికారుల పనితీరుపై రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా నివారణకు తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరించినపుడు న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిపై దాఖలైన ప్రజావాజ్య పిటిషన్‌పై గురువారం నాడు విచారణ కొనసాగింది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సదుపాయం కల్పించాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. ప్రజలకు మాస్కులను ఉచితంగా సరఫరా చేయాలని హైకోర్టు సూచించింది. కేరళలో కరోనా నివారణకు ఎలాంటి చర్యలను తీసుకున్నారో తెలుసుకోవాలని పేర్కొనగా, పది మంది వైద్యుల బృందం కేరళ పర్యటనకు వెళ్తోందని ప్రభుత్వం తరఫున ఏఏజీ పేర్కొన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలను వేశామని, అనునిత్యం కరోనా నివారణకు చేపట్టిన చర్యలపై సమీక్ష జరుగుతోందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కరోనా నివారణకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేసింది.
భూ కబ్జా కేసులో హైకోర్టుకు ..
గోపన్నపల్లి భూముల వ్యవహారంలో ప్రభుత్వ జోక్యాన్ని నిరోధించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ భూముల్లో రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, అత్యవసర విచారణ జరపాలని కోరుతూ రేవంత్‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే అధికారులు తమ భూముల్లో చొరబడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు అనుగుణంగా రెవిన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో తమ భూమిని 15 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశామని, ఆర్డీవో నిబంధనలు పాటించుకుండా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది వేణుగోపాల్ వాదనలు వినిపించారు. 2005లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి అధికారులు కుట్ర పన్నుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంత వరకూ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. తమ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా రెవిన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. రేవంత్ సోదరుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అసలు ఏం జరిగిందో వివరాలు చెప్పాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులకు సూచించింది.
సచివాలయ నిర్మాణంపై విచారణ
నూతన సచివాలయ నిర్మాణంపై గురువారం నాడు కూడా వాదనలు కొనసాగాయి. ఇపుడున్న సచివాలయ భవనాలు వినియోగానికి ఏ మాత్రం యోగ్యంగా లేవని , కొత్త భవనాలను నిర్మించడమే ఏకైక మార్గమని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం తీసుకున్న విధాన నిర్ణయాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరిట సవాలు చేయడానికి వీలు లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. టెక్నికల్ కమిటీ నివేదిక ఆధారంగానే మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.