క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో దుప్పి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మార్చి 5: రోడ్డు ప్రమాదంలో జనారణ్యంలోకి వచ్చిన దుప్పి మృతి చెందింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం 44వ జాతీయ రహదారి బైపాస్ ఎంఎస్‌ఎన్ పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వాహనం రోడ్డు దాటుతున్న దుప్పిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. విషయాన్ని కమ్మదనం ఆటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ రవీందర్‌కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన దుప్పి కమ్మదనం అడవి ప్రాంతానికి తీసుకువెళ్లి పోస్టుమార్టాన్ని కిషన్‌నగర్ పశువైద్యాధికారి డాక్టర్ ముక్కంటి రాజు నిర్వహించారు.