క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి కార్మికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మార్చి 9: యజమాని నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన నగర శివారు కాటేదాన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. బిహార్‌కు చెందిన సూరజ్ మూడు నెలలుగా కాటేదాన్‌లోని స్వస్తిక్ ఆయిల్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫ్యాక్టరీలోకి నీళ్లు చేరాయి. వాటిని ఎత్తిపోయమని సూపర్‌వైజర్ చెప్పడంతో బకెట్‌తో నీళ్లు పారబోసేందుకు సూరజ్ వెళ్లాడు. నీటిలో అడుగు పెట్టగానే తేలి ఉన్న కరెంట్ తీగలు తగలడంతో విద్యాద్ఘాతానికి గురైన సూరజ్ కిందపడిపోయాడు. యాజమాన్యం స్పందించకపోవడంతో సూరజ్ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. చివరకు మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.