క్రైమ్/లీగల్

ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, మార్చి 9: ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటమునిగి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మదనపల్లె రూరల్ పోలీసుల కథనం మేరకు మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీకి చెందిన దివ్యాంగుడు శ్రీనివాసులు, భార్య గౌరవమ్మ కుమారుడు సందీప్ (13) ఏడో తరగతి, అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు బావమరిది కుక్కల ఈశ్వరయ్య, గంగాదేవి కుమారుడు గణేష్ (9) నాల్గో తరగతి స్థానిక చీకలబైలు ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం హోలీ పండుగ కావడంతో స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నారు. ఊరికి సమీపంలోని వెంకటమ్మచెరువులో ఈత ఆడేందుకు చెరువులో దిగారు. నీరు లోతుగా ఉండటంతో నిమిషాల వ్యవధిలోనే ఈత రాకపోవడంతో ఆ చిన్నారులు ఇద్దరు నీటి మునిగిపోయారు. సమీపంలోని దుస్తులు ఉతుకుతున్న గ్రామస్థురాలు పాపులమ్మ గమనించి కేకేలు వేసింది. సమీప పొలాల వద్ద ఉన్న రైతులు పరుగున వచ్చి నీటమునిగిన ఇద్దరు చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే వారు చనిపోయి ఉండటంతో మృతుల తల్లదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
*చిత్రం... ఈతకెళ్లి మృతి చెందిన చిన్నారులు సందీప్, గణేష్