క్రైమ్/లీగల్

వాటర్ టబ్బులో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 10: వాటర్ టబ్బులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం కొంపల్లి, మాలకుంటబావి కాలనీలో నివాసముండే వెంకట్రావ్ కుమార్తె భాగ్యవతి (3) ఇంటి ముందు ఆడుకుంటుందని అనారు. మూతలేని వాటర్ టబ్బులో ప్రమాదవశాత్తు పడి పోయిందని తెలిపారు. అనంతరం తల్లిదండ్రులు చిన్నారి పాప కోసం చుట్టు పక్కల ఎంతవెతికినా దొరకలేదని అన్నారు. ఈ క్రమంలో వాటర్ టబ్బులో చూడగా అందులో పడిపోయిన చిన్నారి మృతి చెందినదని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.