క్రైమ్/లీగల్

ఖైరతాబాద్‌లో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 11: ఇద్దరు యువకుల మధ్య చెలరేగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పవన్ కళ్యాణ్(21) లక్డీకపూల్‌లోని విఘ్నేష్ విరాట్ హోటల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. హోటల్‌లో పనిచేసే సిబ్బంది కోసం యాజమాన్యం ఖైరతాబాద్‌లో ఓ గదిని అద్దె తీసుకుంది. పలువురు యువకులతో కలిసి పవన్ కూడా అందులోనే నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం హోటల్‌లో సిబ్బంది తక్కువగా ఉండటంతో దినసరి వేతనం చెల్లించేలా పబ్లిక్ గార్డెన్ అడ్డాపై ఉన్న ఓ యువకుడిని తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం పవన్ నూతనంగా పనిలో చేరిన యువకునికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రేకుడైన సదరు యువకుడు.. పవన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు.
ఛాతికి ఎడమవైపు పలుమార్లు దాడి చేయడంతో తీవ్ర రక్తస్త్రావం అయిన పవన్ అక్కడే కుప్పకూలి పోయాడు. విషయం తెలుసుకొని పోలీసులకు స్థానికులు సమాచారం అందించి విషమ పరిస్థితిలో ఉన్న పవన్‌కు సమీపంలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు పొందుతున్న పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు దార్యప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా జరిపిన విచారణలో దాడి చేసి పరారైన వ్యక్తిని వాసుగా గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.