క్రైమ్/లీగల్

ఓఎల్‌ఎక్స్ ద్వారా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 11: ఓఎల్‌క్స్ ద్వారా మోసపోయిన బాధితునికి సైబర్ క్రైం పోలీసులు ఊరట కలిగించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన భీమవరపు ఫణికుమార్ 2017లో ఓఎల్‌ఎక్స్ ద్వారా ఓ కారును చూశారు. సదరు యాప్ ఇవ్వబడిన ఫోన్ నెంబర్‌తో ఫణికుమార్ సంప్రదింపులు జరిపారు. అతనితో మాట్లాడిన అవతలి వ్యక్తి తనను పరిచయం చేసుకుంటూ ఎయిర్ కార్గో అధికారినని నమ్మబలికాడు. దీంతో ఫణికుమార్ మారుతీ స్విఫ్ట్ కారు మోడల్, ఖరీదు నచ్చడంతో రూ.2,50,000 లక్షలకు బేరం కుదుర్చుకుని మొదటి విడతగా ఎయిర్ కార్గో అధికారిగా చెప్పిన వ్యక్తి ఇచ్చిన ఓ ప్రైవేటు బ్యాంకు అకౌంటుకు దఫాలవారీగా రూ.1,86,000 లక్షలు పంపాడు. అనంతరం అవతలి వ్యక్తి మీ కారును గన్నవరం విమానాశ్రయం వద్దకు పంపుతామని చెప్పాడు. అక్కడకు చేరుకున్న ఫణికుమార్ కారు రాకపోయేసరికి సదరు వ్యక్తికి ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంకు అకౌంటును ఫ్రీజ్ చేశారు. ఆతర్వాత కేసులో పురోగతి లేకపోయేసరికి బాధితుడు సైబర్ క్రైం పోలీసులను సంప్రదించగా దర్యాప్తు చేపట్టిన సీఐ కే శివాజీ బ్యాంకు అధికారులను సంప్రదింపులు జరిపి లక్షా 86వేలకు డీడీ రిలీజ్ చేశారు. దీంతో బాధితునికి న్యాయం జరగడంతో సీఐ శివాజీతో కలిసి పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు వద్దకు వచ్చి కృతఙ్ఞతలు తెలియచేశారు.

*