క్రైమ్/లీగల్

లెక్కతేలిన సెంట్రల్ బ్యాంక్ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 11: జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇటీవల జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి లెక్క తేలింది. బ్యాంక్ అప్రైజర్‌గా గత రెండు దశాబ్దాలుగా నమ్మకంగా పని చేస్తున్న సత్య వరప్రసాదరావు చేతివాటాన్ని ప్రదర్శించి ఏకంగా రూ.6.71కోట్లకు బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడు. ఇటీవల గోల్డ్ లోన్స్ మంజూరులో అవకతవకలను గుర్తించిన బ్యాంక్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఆడిట్ నివేదిక ఆధారంగా అప్రైజర్ సత్య వరప్రసాదరావు రోల్డ్‌గోల్డ్ నగలను బంగారు అభరణాలుగా కుదవ పెట్టి ఖాతాదారులకు తెలియకుండానే పెద్ద మొత్తంలో రుణాన్ని తన జేబులో వేసుకున్నాడు. దీనిపై బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్ వినోద్ మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అప్రైజర్‌పై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి సీఐ వెంకట నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అప్రైజర్ సత్య వరప్రసాదరావు బ్యాంక్ నిబంధనలకు వ్యతిరేకంగా 88 మందికి చెందిన గోల్డ్ లోన్ ఎకౌంట్స్‌లో మొత్తం రూ.6కోట్ల 71లక్షల 72వేల 125లకు రుణం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంక్ సిబ్బంది గోల్డ్ అప్పరైజర్‌తో కలిసి బంగారు ఆభరణాలకు బదులుగా నకిలీ ఆభరణాలను బ్యాంక్ లాకర్‌లో పెట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. 68 ఖాతాలకు సంబంధించిన రుణగ్రహీతలు ఎవ్వరూ రాకపోవడంతో బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు.