క్రైమ్/లీగల్

డబ్బు విషయంలో మనస్పర్థలే ఆనంద్‌రెడ్డి హత్యకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 11: ఖమ్మం లేబర్ అసిస్టెంట్ అధికారి మోకు ఆనంద్‌రెడ్డి (45) కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. అందుకు బాధ్యులైన ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రదీప్‌రెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. డబ్బు విషయంలో వచ్చిన మనస్పర్థల వల్లే ఆనంద్ రెడ్డిని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు వాడిన క్వాలీస్ వాహనంతో పాటు రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి వివరించారు.
అరెస్ట్ అయిన వారిలో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన పింగిలి శివరామకృష్ణ, శనిగరం గ్రామం కమలాపూర్ మండలం, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మీనుగు మధుకర్, అదే గ్రామానికి చెందిన నిగ్గుల శంకర్‌లను అరెస్ట్ చేయగా ప్రధాన నిందితులైన పింగిలి ప్రదీప్‌రెడ్డి, నిగ్గుల రమేష్, విక్రమ్‌రెడ్డి పరారీలో ఉన్నారు. మృతుడి సోదరుడు మోకు శివారెడ్డి ఫిర్యాదు మేరకు హన్మకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 10న హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద పింగిలి ప్రదీప్‌రెడ్డి అనుచరుడైన పింగిలి శివరామకృష్ణ క్వాలీస్ వాహనంలో పారిపోతుండగా పోలీసులకు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒపుకున్నాడు. పంచనామా చేసి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని అతన్ని తీసుకొని సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మిస్సింగ్‌లో ఉన్న ఆనంద్‌రెడ్డి శవం కనిపించింది. శవాన్ని పరిశీలించగా కుళ్ల్లిపోయిన పరిస్థితిలో ఉంది. పింగిలి శివరామకృష్ణ సమాచారం మేరకు పింగిలి ప్రదీప్‌రెడ్డి, మోకు ఆనంద్‌రెడ్డిమధ్య డబ్బుల విషయంలో మనస్పర్ధలే గొడవలకు దారి తీసింది. ఇందులో భాగంగానే ప్రదీప్‌రెడ్డి ఒక పథకం ప్రకారం మోకు ఆనంద్‌రెడ్డిని ఎలాగెనా చంపాలనుకొని ఈనెల 7న పైన తెలిపిన నిందితులు అందరూ కలిసి ముందుగానే కారులో భూపాలపల్లి జిల్లా రాంపూర్ వద్దగల గట్టమ్మ తల్లి దేవస్థానం వద్దకు వెళ్లారు. ఈలోగా ప్రదీప్‌రెడ్డి హన్మకొండ నుండి లేబర్ అధికారి మోకు ఆనంద్‌రెడ్డిని వెంట తీసుకొని అక్కడికి వచ్చాడు.
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అందరూ కలిసి ఆనంద్‌రెడ్డిని చంపి శవాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుండి పరారైపోయినట్టు పోలీసులు తెలిపారు. అతని ద్వారా కేసులో ఏ-5గా ఉన్న మీనిగు మధుకర్, ఏ-6గా ఉన్న నిగ్గుల శంకర్‌లను అదుపులోకి తీసుకొని మొత్తం ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. ఏ-1నిందితుడు పింగిలి ప్రదీప్‌రెడ్డి, ఏ-2 నిందితుడు నిగ్గుల రమేష్, ఏ-3 నిందితుడు విక్రమ్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
*చిత్రం... లేబర్ అధికారి ఆనంద్‌రెడ్డి హత్య కేసులో నిందితుల అరెస్టు చూపుతున్న హన్మకొండ పోలీసులు