క్రైమ్/లీగల్

మీ స్పందన ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో తాజాగా మరోపిటిషన్ దాఖలైంది. గురువారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఢిల్లీ పోలీసులు, ఆప్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని, దీనిపై ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. ఎవరైతే విద్వేషపూరిత ప్రసంగాలు చేశారో వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలన్నారు. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ సీ హరి శంకర్‌తో కూడిన ధర్మాసనం పోలీసులు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈశాన్య ఢిల్లీలో గత నెలలో జరిగిన అల్లర్లు, ఆస్తుల నష్టానికి రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై ఈనెల 16లోగా వివరణ ఇవ్వాలన్న కోర్టు ఇంతకు ముందు ఢిల్లీ అల్లర్లపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి 20 విచారిస్తామని ప్రకటించారు. అలాగే సంబంధిత కేసుల్లో 16 లోగా అఫిడవిట్‌లు దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు చెప్పారు. ఈమేరకు తుషార్ మెహతా అభ్యర్థనకు కోర్టు అనుమతి ఇచ్చింది. సామాజిక కార్యకర్త హరీష్ మందెర్ విద్వేష ప్రసంగం చేశారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అలాగే బీజేపీ నేతలపైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. తాజాగా లాయర్స్ వాయిస్ రాజకీయ నాయకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వాయిస్ ఆరోపించింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల ఢిల్లీ అల్లర్ల సందర్భంగా అరెస్టు చేసిన వారి పేర్లు బహిర్గతం చేయాలని బీజేపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తిరస్కరించడాన్ని కారత్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు దీపక్ మదన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ నాయకుల ప్రసంగాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, వారి వల్లే మతఘర్షణలు చోటుచేసుకున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఈ నాయకులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు విద్వేష ప్రసంగాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదని పిటిషనర్ ఆరోపించారు.