క్రైమ్/లీగల్
బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 14: పాతబస్తీ బహదూర్‌రా పోలీస్టేషన్ పరిధిలోని కిషన్‌భాగ్ ప్రాంతం గుండా ప్రవహించే మూసి నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తు బావిలో పడి ఇద్దరు చిన్నార్లు మృతి చెందారు. దీంతో జియాగూడా ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జియాగూడ ప్రాంతానికి చెందిన 4, 5 తరగతి చదువుతున్న విద్యార్థులు రోహన్ సింగ్ (10), అక్షయ్ (9)లు కలిసి మూసీనది కాశిబుగ్గ దేవాలయం పక్కన ఉన్న చిన్న బావిలో చేపలు పట్టుటకు వచ్చి ప్రమాదవాశాత్తు బావిలో పడి మునిగిపోయారు. విషయం తెలసుకున్న బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియాకు తరలించిన్నట్లు బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్ డీ.దుర్గాప్రసాద్ తెలిపారు.