క్రైమ్/లీగల్
ఏసీబీకి చిక్కిన పెదముత్తేవి వీఆర్‌ఓ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కూచిపూడి, మార్చి 14: పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరుకు రూ.5వేలు లంచం తీసుకుంటూ మొవ్వ మండలం పెదముత్తేవి వీఆర్‌ఓ అరేపల్లి రవి శనివారం అవినీతి నిరోధక శాఖాధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గ్రామానికి చెందిన రైతులు మట్టా వీర రామప్రసాద్ తన తండ్రి పొలమైన 2.30 ఎకరాలను అన్నదమ్ములకు విడకొట్టుతున్న క్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలకై రూ.5వేలు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితులు గత నెల 25వతేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్పందన (ఎసీబీ) 14400 నెంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు ఎసీబీ అడిషనల్ ఎస్పీ కెఎం మహేశ్వరరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం వీఆర్‌ఓ కార్యాలయంలో ఉన్న సమయంలో ప్రసాద్ నుండి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడ్డ వీఆర్‌ఓ రవిని అదుపులోకి తీసుకుని విజయవాడలోని ఎసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్టు తెలిపారు. ఈ దాడిలో అడిషనల్ ఎస్పీతో పాటు ఎసీబీ సీఐలు డి శ్రీనివాస్, హ్యాపి కృపావందనం, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.