క్రైమ్/లీగల్

టిప్పర్ ఢీకొని బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, మార్చి 14: టిప్పర్ వేగానికి మరోప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇష్టం వచ్చినట్లుగా లారీలను నడుపుతూ కనీసం పక్కన ఎవరు వస్తున్నారో కూడా చూడనంత నిర్లక్ష్యాన్ని డ్రైవర్లు చూపిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక విద్యార్థి లారీడ్రైవర్ నిర్లక్ష్యానికి బలై తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని మిగిల్చాడు. ఈ సంఘటన నున్న గ్రామీణ పోలీసుస్టేషన్ పరిధిలోని వాంబేకాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అజిత్‌సింగ్‌నగర్ వాంబే కాలనీ ప్రాంతానికి చెందిన తోకల సరోజిని, అమె భర్త శ్రీనువాసరెడ్డి ఇంటి దగ్గరే టిఫిన్ బండి నిర్వహిస్తూ జీవనం గడపుతున్నారు. 2నెలల క్రితం వరకు వైజాగ్‌లో నివాసముండే వీరు ఇక్కడకు వచ్చి అద్దెఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు మగ సంతానం. వీరిలో ఒకడైన డోకల మహేంద్రరెడ్డి (11) 5వ తరగతి చదువుతున్నాడు. ఇక్కడకు వచ్చినప్పటి నుండి నాని స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈక్రమంలో శనివారం నాడు సాయంత్రం 4గంటల సమయంలో సైకిల్ తొక్కుదామని బయటకు వచ్చాడు. అదే సమయంలో పైపులరోడ్డు నుండి డిస్నీలాండ్ వైపు అతి వేగంగా వస్తున్న టిప్పర్ ఆ బాలుడ్ని ఢీకొంది. తలపై నుండి వాహనం వెళ్లడంతో తల భాగం మొత్తం ఛిద్రమైంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్పటికే లారీ డ్రైవర్ పరారైయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.