క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా ఉద్యోగిని దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 15: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహిళా ఉద్యోగిని దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లి మున్సిపల్ ప్రాంతంలో నివాసం ఉండే జంగిలి రాజ్‌కుమార్ భార్య జంగిలి సువర్ణ(33) మండలంలోని కండ్లకోయ పరిధిలోని డెలివరీ డాట్ కామ్ కంపెనీలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది. రోజు మాదిరిగానే శనివారం సాయంత్రం తన విధులు ముగించుకుని హోండా అక్టివా ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరింది. కండ్లకోయ చౌరస్తా వద్దకు రాగానే మృత్యురూపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన సువర్ణను చికిత్స నిమిత్తం 108 అత్యవసర వాహనంలో కొంపల్లిలో ఫ్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించినట్లు పోలీసులు పేర్కొన్నారు.్స డ్రైవర్ లైసెట్టి గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.