క్రైమ్/లీగల్

ఎన్నికల వాయదాపై సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల సంఘం కరోనా వైరస్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం సుప్రీం కోర్టులో న్యాయమూర్తి లలిత్ ధర్మాసనం ముందు స్థానిక సంస్థల ఎన్నికలను వా యిదా వేయడాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిందని ఆయన న్యాయమూర్తి లలిత్‌కు వివరించారు. దీనిపై న్యాయమూర్తి లలిత్ స్పందిస్తూ మంగళవారం కేసుల జాబితాలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశాన్ని చేర్చాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడం చట్ట విరుద్దమని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.