క్రైమ్/లీగల్

ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మార్చి 16: ఉల్లాసంగా సైకిల్ తొక్కుతున్న ఆ బాలుడికి ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించిన సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. స్యూరపేటకు చెందిన నాగేష్ మంగమ్మ, గత ఏడాది క్రితం బతుకుదేరువు కోసం నగరానికి వచ్చి మీర్‌పేట్ నగర పాలక సంస్థ జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీలో నివాసం ఉంటూ.. మార్బుల్స్ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. నాగేష్ మంగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు జగదీష్ (12) బాలాపూర్ శ్రీ గాయత్రీ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండ చేపట్టిన చర్యలో భాగంగా పాఠశాలలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించడంతో.. ఉదయం జగదీష్ మరో విద్యార్థితో కలిసి సైకిల్ తొక్కుతున్నాడు. జిల్లెగూడ నుంచి మీర్‌పేట్ వైపునకు ట్రాక్టర్ వెళ్లుచున్నదని తెలిపారు. ట్రాక్టర్ మీర్‌పేట్ లలిత నగర్ చౌరస్తా స్వామి వివేకనంద విగ్రహం దగ్గరకు రాగానే కాలనీ రోడ్డు నుంచి జగదీష్ మరో బాలుడుతో కలిసి సైకిల్ తొక్కుతూ వచ్చి అదుపు తప్పి ట్రాక్టర్ టైర్‌కు తగిలించినాడని అన్నారు. దీంతో మరో బాలుడు పక్కకు పడిపోగా, జగదీష్ వెనుక టైర్ కింద పడిపోవడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని, దర్యాప్తులో ఉందని అన్నారు.