క్రైమ్/లీగల్

దిశ ఘటన మరువక ముందే మరో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మార్చి 17: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం చోటుచేసుకుంది. శంషాబాద్‌లో దిశ సంఘటన మరువక ముందే చేవెళ్లలో మహిళను హత్యచారం చేసి హత్య చేసి అతి దారుణంగా తలను గుర్తు తెలయకుండా బండరాళ్లతో కొట్టి పడేశారు. సమచారం తెలుసుకున్న చేవెళ్ల ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ బాలకృష్ణ, ఎస్‌ఐ రేణుకా రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌టీంతో పరిశీలించారు. అనంతరం అక్కడ మృత్యురాలి బంగారు గాజులు, చెవి పోగులను ల్యాబ్‌కు పంపించారు. చేవెళ్ల మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగిందని తెలిపారు. మృతిచెందిన మహిళను గుర్తించేందుకు అనావాళ్లు తెలియకుండ తలను, ముఖాన్ని బండరాళ్లతో పగుల గొట్టారు. మృతురాలిని ఎక్కడో హత్య చేసి తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద పడవేశారని తెలిపారు. మహిళ ఒంటిపైన ఎలాంటి దుస్తువులు లేవని అన్నారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని గుర్తు పట్టినవారు చేవేళ్ల పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
*చిత్రం...సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీసీపీ ప్రకాష్ రెడ్డి