క్రైమ్/లీగల్

పునఃసమీక్ష ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: సవరించిన స్థూల ఆదాయం (ఐజీఆర్)పై చార్జీల చెల్లింపు అంశంపై పునఃసమీక్ష ఉండబోదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏజీఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సుప్రీం కోర్టు ఇదివరకే టెలికాం సంస్థలను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, నష్టాల ఊబిలో కూరుకుపోయిన కంపెనీలను ఆదుకోవడానికి వీలుగా ఏజీఆర్ చార్జీలను రద్దు చేయాలని, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని టెలికాం సంస్థల అధికారులు పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు బకాయిల్లో కొంత శాతాన్ని చెల్లించగా, మిగతా సంస్థలు ఉదాసీనంగా ఉన్నాయి. ఏజీఆర్ చార్జీలను వసూలు చేయవద్దంటూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలు చెల్లించి తీరాలని ఇదివరకే ఆదేశించినప్పటికీ మరోసారి అదే అంశంపై కోర్టుకు రావడం అర్ధరహితమని వ్యాఖ్యానించింది. బకాయిలను వసూలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్నదని మండిపడింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. భారతీ ఇన్‌ఫ్రా టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమయ్యాయి. కాగా, షేర్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతున్న కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇప్పుడు వెనుకంజ వేస్తున్నారు. వారు కూడా షేర్ల విక్రయానికి మొగ్గుచూపుతున్నారు. ఈనెలలో ఇప్పటివరకు 38,188 కోట్ల రూపాయల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మేశారు. కరోనా వైరస్ సమస్య ఒకవైపు, సుప్రీం కోర్టు ఆదేశాలు మరోవైపు భారత స్టాక్ మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.