క్రైమ్/లీగల్

దోషాలు వదిలిస్తా.. యాంకర్‌ని చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మార్చి 18: అందరి జాతకాలు చెబుతానని, తలరాతలు మారుస్తానని మాయమాటలతో బురిడీ కొట్టించిన జ్యోతిష్యుడు అచ్చిరెడ్డి జాతకం మారిపోయింది. అతనిపై భవానీపురం పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. దోషాలు వదిలిస్తా, దంపతుల మధ్య మనస్పర్థలు మటు మాయం చేస్తా, అసలు నీ జాతకమే మార్చేస్తా నా చేతిలో మంచి సినీ డైరెక్టరులున్నారు. యాంకర్‌ని చేస్తా అం టూ నగరంలోని ముత్యాలంపాడుకి చెందిన ఓ మహిళను మాయమాటల తో బురిడి కొట్టించి అంచలంచలుగా రూ.18లక్షలు దండుకొన్నారని బాధితురాలు తిప్పరెడ్డి పద్మసాయిరెడ్డి (26) ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అచ్చిరెడ్డిపై భవానీపురం పోలీసులు బుధవా రం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పద్మసాయిరెడ్డికి అత ని భర్తకు మనస్పర్థలు వచ్చాయి. దాం తో ఆమె భర్త వద్ద నుండి పుట్టింటికి చేరింది. తన అక్క సాయిప్రవీణ ద్వా రా బాధితురాలు జ్యోతిష్యుడు కోనాల అచ్చిరెడ్డిని ఆశ్రయించింది. సర్పదో షం, రాహుకేతువుల దోషం ఉందని పూజలు చేయాలని రూ.58వేలు వసూ లు చేశారు. జంట నాగుల పూజ, కాలభైరవ పూజలు చేయించారు. ఇద్దరు పూజారులకు ఒక్కొక్కరికి రూ.1116 ఇప్పించారు. నీ జాతకం మారుస్తాం మంచి సినీ ఆర్టిస్టుని, యాంకరుని చేస్తాం మంచి జీవితానికి మరో హోమం చేస్తామని నమ్మించి రూ.43వేలు వసూలు చేశారు. లాఫింగ్ బుద్దా బొమ్మ ఇంట్లో పెట్టుకొంటే ధన ప్రవాహం జరుగుతుందని నమ్మించారు. కుజదోష నివారణ పూజలు నిర్వహిస్తామని మరో రూ.50వేలు ఇలా అంచలంచలుగా మొత్తం రూ.18 లక్షలు దండుకొన్నాడని ఆయన పూజలూ ఫలించలేదు, ఆయన చెప్పినట్లుగా తనకు మంచి జరగలేదని తనను మాయమాటలతో వంచించి డబ్బులు దండుకున్న నిందితునిపై తగిన చర్య తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్చిరెడ్డిపై కేసు నమోదు చేశారు. కేసును సీఐ డికె మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. కాగా అచ్చిరెడ్డిపై ఖమ్మంలోని వన్‌టౌన్ పోలీసులు పలు రకాల కేసులు నమోదు చేయగా గత 15 రోజులుగా ఆయన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యం కావడం భవానీపురంలో సంచలనం సృష్టించింది. ఇంతవరకూ ఆ కుటుంబ సభ్యులు జాడ తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొన్న భవానీపురం పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.