క్రైమ్/లీగల్

బంతి ఇంట్లో పడిందని బాలుడిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 19: క్రికెట్ అడుతుండగా బంతి వచ్చి ఇంట్లో పడిందని కోపానికి గురైన ఇంటి యజమాని బాలుడిని చితకబాదిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్ ఆర్‌కెపురంలో నివసించే జయబాబు కుమారుడు ధాత్రియన్ తన స్నేహితులతో కలసి ఇంటి వద్ద క్రికెట్ అడుకుంటుండగా బంతి వెళ్లి పక్కనే నివాసం ఉంటున్న అమరేందర్ సింగ్ ఇంట్లో పడినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అవేశానికి గురైన అమరేందర్ బంతి కోసం వెళ్లిన బాలుడిని పట్టుకుని ఇష్టానుసారంగా కొట్టడంతో బాలుడు గాయపడడంతో కుటుంబ సభ్యులు నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.