క్రైమ్/లీగల్

కరోనాతో కోర్టు కేసులు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 19: ఎప్పుడూ కక్షిదారులతో కళకళలాడే జిల్లా కరోనా దెబ్బతో ప్రధాన న్యాయస్థానం గురువారం వెలవెలబోయింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా జాఢ్యం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టుకుంది. ఎప్పుడు ఎక్కడ కరోనా కేసులు నమోదవుతాయో తెలియక ప్రభుత్వం సతమతమవుతున్న తరుణంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా సంస్థలకు మూసివేతకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా హైకోర్టు ఆదేశాలతో న్యాయస్థానాలకు కూడా శెలవులు ప్రకటించింది. ఈ నెల 31వతేదీ వరకు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల కేసుల విచారణను నిలిపి వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో కేసుల విచారణ నిలిచిపోయింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు గురువారం న్యాయవాదులకు కేసుల విచారణ వాయిదాకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పది రోజుల పాటు ఎటువంటి కేసుల విచారణ జరగదని, న్యాయవాదులతో పాటు కక్షిదారులెవ్వరూ కోర్టులకు రానవసరం లేదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు మీ తరపున న్యాయవాదులను సంప్రదించాలని కక్షిదారులకు సూచించారు. ఇప్పటికే జిల్లా కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించి లోనికి అనుమతిస్తున్నారు. కేసుల విచారణను పది రోజులు వాయిదా వేస్తూ జిల్లా జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని పోలీసు సిబ్బంది కోర్టు ప్రధాన గేటు వద్ద మైక్ ప్రచారం ద్వారా కక్షిదారులకు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నిత్యం కక్షిదారులతో కళకళలాడే న్యాయస్థానాలు కరోనా దెబ్బతో ఒక్కసారిగా వెలవెలబోయాయి.