క్రైమ్/లీగల్

ఏటీఎం ధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, మార్చి 21: ఏటీఎం అద్దాలను ధ్వంసం చేసిన సంఘటన పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కన చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం అద్దాలను ధ్వంసం చేశారు. శనివారం ఉదయం కొంతమంది వ్యక్తులు ఏటీఎం వద్దకు డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లగా అప్పటికే ఏటీఎం అద్దాలు ధ్వంసమై ఉన్నాయని స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. ఏటీఎంలో చోరీ చోటు చేసుకుందా లేదంటే డబ్బులు పోయాయా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.