క్రైమ్ కథ

విసుగుకి చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బికినీలోని ఎలినార్ సీలింగ్ క్లబ్ బాల్కనీలో కూర్చుని తన గోళ్ళకి వేసుకున్న రంగుని చూసింది. ఆమెకి ఆకుపచ్చ రంగు నచ్చలేదు. వెంటనే సన్నగా హమ్ చేస్తూ దాన్ని లోషన్‌తో తుడిచేసి ఆరెంజ్ రంగు వేసుకోసాగింది. సగం వేళ్ళకి వేసాక దాన్నీ తుడిచేసి ఒకో వేలుకి ఒకో రంగు వేసుకోసాగింది.
ఎలినార్ తన భర్త జార్జ్‌తో మయామీకి సెలవలు గడపడానికి వచ్చింది. అపార్ట్‌మెంట్లో తనకి జీవితం చాలా విసుగ్గా ఉందని ఎలినార్ చాలాకాలంగా గొణుగుతూండటంతో జార్జ్ ఆమెని క్రిస్‌మస్ సెలవలకి మయామీకి తీసుకువచ్చాడు.
‘‘ఇది సెకండ్ హనీమూన్.’’చెప్పాడు.
అప్పటికే తమ పెళ్ళై రెండేళ్ళు గడిచింది. కానీ అది ఆమెకి పదేళ్ళు గడిచినట్లుగా అనిపించింది. పొట్ట, బట్టతల వచ్చిన ఏభై ఒక్కేళ్ళ జార్జ్‌ని ఇరవై రెండేళ్ళ ఎలినార్ డబ్బు కోసం చేసుకుంది. ఇది ఇద్దరికీ తెలుసు. అందుకే జార్జ్ ఆమె ఖర్చుల లెక్క అడగడు. ఎంత ఖర్చు చేసినా అభ్యంతరం చెప్పడు. తమ మధ్య గల ముప్ఫై ఏళ్ళ తేడాకి అది నష్టపరిహారంగా భావిస్తాడు.
‘‘డార్లింగ్. అనుకోకుండా నేను ఇవాళ వీడియో కాల్‌లో దేశంలోని మిగతా మేనేజర్లతో సమావేశం అవాలి. ఈ రోజంతా బిజీగా ఉంటాను. నీకు మన హోటల్ గదిలో ఉండటం విసుగ్గా ఉంటే షాపింగ్‌కి వెళ్ళు. బోటింగ్ చెయ్యి. నీ ఇష్టం. ఎలా కావాలంటే అలా గడుపు.’’ జార్జ్ చెప్పాడు.
ఆమె ఎప్పటిలా అతనికి అర్థం కాకుండా గొణిగింది. తర్వాత చెప్పింది.
‘‘సరే.. సినిమాకి వెళ్ళి సముద్ర యానం చేసి భోజనం బయటే చేసి వస్తాను.’’
‘‘అలాగే. క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళడం మర్చిపోకు. నా పర్స్‌లోని డబ్బుని కూడా తీసుకో. అవసరం రావచ్చు.’’ జార్జ్ పో త్సహిస్తూ చెప్పాడు.
ఆమె సినిమా హాల్లోంచి బయటకి వచ్చి లంచ్ చేసి బి స్కైన్ బేలో పడవ విహారం చేయాలనుకుని పడవల రేవుకి చేరుకునేసరికి మధ్యాహ్నమైంది. రాత్రి భోజన సమయానికి తిరిగివచ్చి, కోకోనట్ గ్రోవ్ అనే రెస్టారెంట్‌లో సీ ఫుడ్ డిన్నర్ చేయాలని అనుకుంది. ఫ్లైయింగ్ ఆస్కట్ అనే మర పడవని జార్జ్ రెండు రోజుల కోసం అద్దెకి తీసుకున్నాడు. ఆమె సరాసరి దాని దగ్గరికి వెళ్ళింది. దాని నావికుడు యువకుడు, అందగాడు. బలమైన కండరాలని బట్టి నిత్యం ఎక్సర్‌సైజ్ చేస్తాడని తెలిసిపోతోంది. అతని పేరు ఏండీ. ఆమెని చూసి చిరునవ్వుతో గ్రీట్ చేశాడు.
‘‘ఎక్కడికైనా వెళ్దాం. దగ్గర్లో ఏదైనా ద్వీపం ఉందా?’’ అడిగింది.
కొద్దిసేపట్లో పడవ అటువైపు బయలుదేరింది. సాయంత్రం నాలుగున్నరకి పడవని ఓ ద్వీపం మెట్ల దగ్గర ఆపి లంగరు వేశాడు. ఇద్దరూ పడవ దిగి మెట్లెక్కి ఆ ద్వీపంలోకి వెళ్ళారు.
‘‘మనం తప్ప ఎవరూ లేరు. ఇది రెండు మైళ్ళ విస్తీర్ణం గల ద్వీపం.’’ఏండీ చెప్పాడు.
‘‘నీకు ఎలా తెలుసు?’’
‘‘ఇంకో పడవ ఆగిలేదు.’’
తామిద్దరే ఆ ద్వీపంలో ఒంటరిగా ఉన్నామన్న ఆలోచనలోంచి ఎలినార్లో ఓ కోరిక కలిగింది. ఆరు బయట ఆకాశం కింద శృంగారం ఎలా ఉంటుంది?
‘‘వెళ్ళి నా బికినీ, బీచ్ టవల్, బీర్ తీసుకురా.’’ ఏండీని ఆజ్ఞాపించింది.
అతను పడవలోంచి వాటిని తెచ్చి ఇసకలో రెండు టవల్స్ పరిచి, బికినీని అందించి బీర్‌ని ఓపెన్ చేసిచ్చాడు. బికినీ వేసుకోడానికి అతని ముందే దుస్తులని విప్పింది. పేంటీ, బ్రా తప్ప ఒంటి మీద ఇంకేమీ లేని ఆమె వంక ఏండీ కళ్ళప్పగించి చూస్తూండిపోయాడు. అతని కళ్ళల్లోని కోరికని గమనించింది.
‘‘వెళ్ళి నీకో బీర్ తెచ్చుకో.’’ నవ్వుతూ చెప్పింది.
అతను మళ్ళీ పడవలోకి వెళ్ళి బీర్ సీసాతో వచ్చాడు. టవల్ మీద వెల్లకిలా పడుకున్న ఆమె అతన్ని పక్కన కూర్చోమన్నట్లుగా సౌంజ్ఞ చేసింది.
రెండు గంటల్లో వాళ్ళ మధ్య మూడుసార్లు రతి జరిగింది. సూర్యుడ్ని చూసి అతను చెప్పాడు.
‘‘నాకు ఇష్టం లేకపోయినా ఇక మనం బయలుదేరాలి. రాత్రి ఇక్కడే ఉంటే మనల్ని వెతకడానికి కోస్ట్ గార్డ్‌లు వస్తారు.’’
ఇద్దరూ లేచి మళ్ళీ పడవ వైపు నడిచారు. అతను బీచ్ టవల్స్, ఖాళీ బీర్ బాటిల్స్‌ని తీసుకువచ్చాడు. సముద్రం మధ్యలో పడవని ఆపి మరోసారి డెక్ మీద రతిని జరిపారు. పడవ రేవుకి చేరాక ఎలినార్ చెప్పింది.
‘‘నాతో భోజనానికి రా.’’
విడిపోబోయే ముందు చెప్పింది.
‘‘మళ్ళీ రేపు వస్తాను. ఆ ద్వీపానికి వెళ్దాం.’’
హోటల్ గదికి చేరుకున్నాక బీర్ తాగుతూ టీవీలో ఫుట్‌బాల్ ఆటని చూసే జార్జ్ అడిగాడు.
‘‘ఎలా జరిగింది ఎలినార్?’’
‘సరదాగా.’’
‘‘నీలోని విసుగు కొద్దిగా తగ్గిందా?’’
‘‘బాగా తగ్గింది.’’
అతనా రోజు ఆమెతో రతిలో పాల్గొనాలి అనుకున్నాడు కానీ కోరిక ఇగిరిపోయిన ఆమె తిరస్కరించింది.
మర్నాడు జార్జ్ చెప్పాడు.
‘‘ఇవాళ కూడా మా కాన్ఫరెన్స్ కొనసాగుతుంది.’’
‘‘నాకు తెలుసు.’’
‘‘ఇలా కష్టపడి పనిచేస్తేనే కదా మనకి ఖర్చులకి డబ్బొచ్చేది.’’
‘‘నిజమే. పనిచేయండి.’’
ఆమె ఇద్దరికీ లంచ్‌ని పేక్ చేయించి తీసుకుని సరాసరి పడవల రేవుకి వెళ్ళింది. ఆమె కోసం ఆత్రంగా ఎదురుచూసే ఏండీ నుంచి కొత్తగా పెర్‌ఫ్యూమ్ వాసన వస్తోంది. పడవ బయలుదేరాక మధ్యలో ఆపాడు. ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ పడవ బయలుదేరి క్రితం రోజుకి వెళ్ళిన ద్వీపానికి కాక మరోచోటికి వెళ్ళింది.
‘‘ఇది నిన్నటిది కాదు.’’2ఎలినార్ దిగుతూ చుట్టూ చూసి చెప్పింది.
‘‘నిన్నటి ద్వీపానికి మూడు పడవలు వెళ్ళాయి. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇది ఇంకా చిన్నది. కానీ మనిద్దరం తప్ప ఇంకెవరూ ఉండరు.’’ అతను చెప్పాడు.
ఇద్దరూ సాయంత్రం ఐదు దాకా అక్కడ స్వేచ్ఛగా గడిపారు. ఎలినార్ పూర్తి సంతఋప్తితో తిరిగి బయలుదేరింది.
‘‘మీరు ఇవాళ రాత్రి దాకానే పడవని అద్దెకి తీసుకున్నారు. అంటే రేపు తిరిగి వెళ్ళిపోతున్నారా?’’ ఏండీ అడిగాడు.
‘‘అవును. రేపు ఉదయం పదకొండుకి మా విమానం న్యూయార్క్ బయలుదేరుతుంది.’’ చెప్పింది.
‘‘నేనూ మీతో న్యూయార్క్‌కి వచ్చేస్తాను.’’ కొద్దసేపాగి ఏండీ చెప్పాడు.
‘‘అక్కడ తెలిసిన వాళ్ళున్నారా?’’
‘‘లేరు.’’
‘‘మరి?’’
‘‘నేను మీతో ప్రేమలో పడ్డాను. మీరు లేకుండా జీవించలేను.’’
ఎలినార్ అతని మాటలకి ఉలిక్కిపడింది.
‘‘న్యూయార్క్‌లో నేనేదైనా ఉద్యోగం సంపాదించుకుంటాను. నాకో అపార్ట్‌మెంట్‌ని చూసి పెట్టండి. అక్కడ మనం తరచూ కలుసుకోవచ్చు.’’
‘‘ఏండీ! నేను దయలేని దాన్ని కాదు. కానీ నాకు సామాజిక పరిమితులు ఉన్నాయి. నా బంధుమిత్రులు దీన్ని హర్షించరు. న్యూయార్క్‌లో ఇంత స్వేచ్ఛగా బయటకి రాలేను. నీతో గడిపిన ఈ రెండు రోజులూ చాలా ఆనందంగా గడిచాయి. మళ్ళీ సెలవలకి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నా గుర్తుగా ఏదైనా కొనుక్కో.’’ ఆమె తన హేండ్ బేగ్‌లోంచి ఇరవై డాలర్ల నోట్‌ని తీసి ఏండీకి ఇచ్చి చెప్పింది.
అతని మొహంలోని విషాదాన్ని చూసి నివ్వెరపోయింది. ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు.
‘‘ఒద్దు. నాకు డబ్బొద్దు. మీరే కావాలి.’’
‘‘కుదరదు అన్నాగా.’’
‘‘ఐతే మీరు నేను అనుకున్నంత దయగలవారు కారు. మీరు నన్ను ప్రేమించడం లేదు.’’కోపంగా చెప్పాడు.
‘‘ప్రేమ, దయా ఉన్నాయి. కాని అందుకు అవకాశమే లేదు.’’
‘‘ఐతే నేను మీ వారికి మన గురించి చెప్తాను.’’
ఎలినార్‌కి కోపం వచ్చింది.
‘‘నువ్వు చెడ్డగా పెంచబడ్డావన్న మాట. నాకు పెళ్ళైంది. నా వైవాహిక జీవితం భగ్నం కావడం నాకు ఇష్టం లేదు.’’ కోపంగా అరిచింది.
‘‘మన ప్రేమ భగ్నం అవడం కూడా నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళాక నన్ను మర్చిపోతారు.’’
‘‘ఐనా నువ్వు మా వారితో చెప్పినా ఆయన నమ్మరు.’’
‘‘ఆయన్ని నమ్మించి మిమ్మల్ని విడగొడతాను. అప్పుడు మీరు నాతో ఉండచ్చు.’’
‘‘నీకు జార్జ్ గురించి తెలీదు. చెప్పుడు మాటలని కొట్టి పారేస్తాడు. మీ బోట్ కంపెనీని నీ మీద ఫిర్యాదు కూడా చేస్తాడు. అప్పుడు నీ ఉద్యోగం ఊడుతుంది.’’
‘‘అందుకు నేను సిద్ధం. ఆయనకి వీడియో చూపిస్తాను.’’
‘‘వీడియో ఏమిటి? ఉలిక్కిపడి అడిగింది. ’’
‘‘బోట్లో నిన్న వెళ్ళేప్పుడు, ఇవాళ వచ్చేప్పుడు జరిగింది వీడియో తీశాను.’’
‘‘అబద్ధాలాడక.’’ ఎలినార్ నవ్వలేక నవ్వుతూ చెప్పింది.
‘‘అబద్ధాలు కాదు. నిజం.’’ తన సెల్‌ఫోన్‌ని ఆన్ చేసి చూపించాడు.
కొద్దిగా చూశాక నిజమని నమ్మింది. అతను తెలిసి చేస్తున్నాడా లేక తెలీకా అన్నది ఆమెకి అర్థం కాలేదు. ఆమె కోపాన్ని, ఆవేశాన్ని అణచుకోలేకపోయింది. అనాలోచితంగా తెడ్డుని అందుకని అతని నెత్తిమీద బలంగా మోదింది. తక్షణం ఏండీ కెవ్వున అరుస్తూ కిందపడ్డాడు. తల మీద పెద్ద బొప్పి కట్టింది కానీ చితకలేదు. ఆమె అటూ, ఇటూ చూసింది. చుట్టుపక్కల ఇంకేం పడవలు లేవు. ఏమాత్రం సందేహించకుండా అతని నడుం పట్టుకుని ఎత్తి పడవ రైలింగ్‌కి ఆనించి, రెండు కాళ్ళు ఎత్తి నీళ్ళల్లోకి తోసేసింది. అతని శరీరం మునిగిపోవడం చూసింది. పది నిమిషాల తర్వాత దూరంగా తేలుగా కనిపించాక తఋప్తిగా నిట్టూర్చింది. నీళ్ళు తగలగానే అతనికి మెలకువ వచ్చి ఈదచ్చని భయపడింది.
తెడ్డుని పరిశీలించి అతని తలని కొట్టిన భాగంలో అంటిన అతని వెంటు కలని కడిగేసింది. అతని సెల్‌ఫోన్‌ని నీళ్ళలోకి గిరాటేసింది. తర్వాత ఇంజన్ ఆఫ్‌చేసి కోస్ట్ గార్డ్‌ల కోసం ఎదురుచూడసాగింది.
జార్జ్ ఫిర్యాదు చేశాక ఆ రాత్రి పనె్నండున్నరకి కోస్ట్‌గార్డ్‌లు వచ్చి ఆమెని రక్షించారు. ఏండీ వద్దంటున్నా వినకుండా పడవ ఆపి లోపల నుంచి చేపలు పట్టి తెస్తానని నీళ్ళల్లోకి దూకాడని, మళ్ళీ రాలేదని ఏడుస్తూ చెప్పింది.
వాళ్ళిద్దరికీ ఒకరితో మరొకరికి పూర్వ పరిచయం లేదు కాబట్టి, ఆమెకి అతన్ని చంపాల్సిన కారణం లేదు కాబట్టి పోలీసులు ఆమె చెప్పింది నమ్మారు. పడవని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆమె చెప్పిన దానికి వ్యతిరేకంగా జరిగిన సూచనలు ఏమీ వాళ్ళకి కనపడలేదు.
***
మర్నాడు ఉదయం ఎలినార్ సూట్‌కేస్‌లని సర్దుతూండగా తలుపు చప్పుడైంది. ఎలినార్ తలుపు తెరచి చూస్తే ఎదురుగా నలభై ఐదేళ్ళ ఓ మగాడు నిలబడి ఉన్నాడు. అతనిలో ఏండీ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘‘నా పేరు ఫిలిప్. ఏండీ నా పెద్దకొడుకు.’’
‘‘ఓ! సారీ. జరిగిందానికి బాధపడుతున్నాను.’’ చెప్పి హేండ్‌బేగ్ తెరచి ఇరవై డాలర్ల నోటుని అతని చేతిలో ఉంచింది.
అతను దానివంక ఎగాదిగా చూసి అడిగాడు.
‘‘ఇంతేనా?’’
ఇంకో ఇరవై డాలర్లు ఇచ్చింది.
‘‘ఈ నెలకి ఐదొందల డాలర్లు ఇవ్వండి.’’ కోరాడు.
‘‘ఈ నెలకా?’’
‘‘అవును. నెలనెలా మీరు నాకు ఐదొందల డాలర్లని పంపుతూండాలి.’’
‘‘ఎందుకని? ఏమిటి నువ్వనేది?’’
‘‘మీ రహస్యం మీవారికి తెలీకుండా దాచడానికి.’’
‘‘ఏం రహస్యం?’’
వెంటనే ఆమెని భయం ఆవరించింది.
‘‘ఏండీకి, మీకు గల శారీరక సంబంధం.’’
‘‘అలాంటిదేం లేదు.’’బలహీనంగా చెప్పింది.
‘‘నా దగ్గర రుజువు ఉంది.’’
‘‘ఏం రుజువు?’’
‘‘గొప్ప కోసం ఏండీ సెల్‌ఫోన్ నించి ఆ వీడియోలని నా రెండో కొడుక్కి పంపాడు. వాడు పోయాక వాటిని ఇందాకే నా రెండో కొడుకు నాకు చూపించాడు. మీరు వెళ్ళిపోతున్నారని తెలిసి వెంటనే వచ్చాను. ఇప్పుడు టైం లేదు కాని వాడు మీ మీద ముచ్చటపడుతున్నాడు. మీరు ఏ నెల నాకు డబ్బు పంపకపోయినా, వచ్చినప్పుడల్లా నా రెండో కొడుకు కోరిక తీర్చకపోయినా ఈ వీడియోని పోలీసులకి ఇస్తాను. మీరు అతన్ని చంపడానికి కారణం దొరికిన మరుక్షణం వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నేను నీతి గల వాడిని కాబట్టి మిమ్మల్ని కోరడం లేదు.’’
విమానం న్యూయార్క్‌కి బయలుదేరాక జార్జ్ అడిగాడు.
‘‘సరదాగా గడిచిందా? మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఇక్కడికి వచ్చేదాకా మళ్ళీ నీకు విసుగు తప్పదేమో?
‘‘ఉహు. వద్దు. ఇక మీదట విసుగు ఉండదు.’’ ఎలినార్ చిన్నగా నిట్టూర్చి చెప్పింది.
*
(ఇసబెల్ ఫీల్డ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి