క్రైమ్/లీగల్

‘ఉన్నావో’ బాధితురాలి మృతిపై చార్జిషీట్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నావో, జనవరి 2: ఉన్నావో అత్యాచార కేసులో బాధితురాలి మృతిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష యం తెలిసిందే. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో తలెత్తిన తీవ్రమైన ఒత్తిడికి పోలీసులు తల వంచక తప్పలేదు. 23 ఏళ్ల ఈ బాధితురాలిని సుమారు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ వినోద్ పాండే గురువారం పీటీఐతో మాట్లాడుతూ, ఉన్నావో కేసుపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు. బాధితురాలిని సజీవ దహనం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై సాక్ష్యాధారాలు సేకరించామని అన్నారు. వాటి ఆధారంగానే వారిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు చెప్పారు. ఉన్నావో బాధితురాలిపై దాడి జరిగి, ఆమెకు నిప్పటించిన సంఘటనపై అధికారులు వెంటనే స్పందించారని, ఆమెను హుటాహుటిన విమానంలో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారని పాండే వివరించారు. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ, గుండె పోటు రావడంతో ఆమె మృతి చెందిందని చెప్పారు. ఐదుగురు ఆమెకు నిప్పంటించారని, వారిలో ఇద్దరు ఈ అత్యాచార కేసులో నిందితులని పాండే పేర్కొన్నారు. కాగా, రాయి బరేలీ కోర్టుకు ఆమె గత నెల 5వతేదీన వెళుతున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. మరుసటి రోజు మృతి చెందింది. మరణించాడానికి ముందు ఆమె తన వాగ్మూలంలో సంఘటనకు సంబంధించిన కొంత సమాచారాన్ని అందించింది. తన ఇంటికి సమీపంలోని గౌరా మలుపువద్ద తనను అటకాయించి, పెట్రోలు పోసి, నిప్పటించారని తెలిపింది. హరి శంకర్ త్రివేది, రాం కిషోర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, శివమ్ త్రివేదీ, శుభమ్ త్రివేది పేర్లను ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. 2018 డిసెంబర్‌లో తనను అపహరించుకెళ్లి అత్యాచారం చేసిన వారిలో శివమ్, శుభమ్ ఉన్నారని ఆమె స్పష్టం చేసింది. మృతురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా చార్జిషీట్‌లో పొందుపరచినట్టు పాండే చెప్పారు.