క్రైమ్/లీగల్

సచివాలయాన్ని కొత్తగా నిర్మిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 2: సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. ప్రతిపాదిత నూతన భవన నిర్మాణ వివరాలు వెంటనే సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయానికి మార్పులు చేస్తారా? కొత్తగా నిర్మిస్తారా? అస లు ప్రభుత్వ ఆలోచన ఏమిటి? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎంత వ్య యంతో కొత్త సచివాలయాన్ని ని ర్మించబోతున్నారని ధర్మాసనం ప్ర శ్నించింది. ఆర్థిక మాంద్యం ప్రభా వం ఉన్న ప్రస్తుత తరుణంలో ఎంత వ్యయం చేయబోతున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రతిపాదిత నూ తన నిర్మాణానికి ఎన్నాళ్లు పడుతుంది? కొత్త భవనాలు పూర్తయ్యే వరకూ సచివాలయం ఎక్కడ నిర్వహిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. వేర్వేరు చోట్ల సచివాలయ కార్యాలయాలు ఉంటే దస్త్రాల కదలిక, గోప్యత విషయం ఏమిటని ప్రశ్నించింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అదనపు ఏజీ రామచందర్‌రావు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. తాము భవనాలను కూల్చివేయవద్దని అన్నామే తప్ప.. నిర్ణయం తీసుకోవద్దని చెప్పలేదని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో ఈనెల 7లోపు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఆరో తేదీకి వాయిదా వేసింది. పిటిషన్లు దాఖలుచేసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి పిటిషనర్ తరఫున వాదిస్తారని, ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని న్యాయవాది దామోదర్‌రెడ్డి కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ ఆరో తేదీకి వాయిదా వేసింది.