క్రైమ్/లీగల్

లడ్డూపై అసత్యప్రచారం.. క్రిమినల్ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 2: సామాజిక మాధ్యమంలో తిరుపతి లడ్డా లేక జీసెస్ లడ్డా అనే పేరుతో అసత్యప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాద్యమంలో విస్తృతంగా ప్రచారం అవుతున్న పోస్టింగ్‌పై టీటీడీ విజిలెన్స్ అధికారులు గురువారం తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసు నమోదు చేశారు. గత నెల డిసెంబర్ 29న తిరుపతి లడ్డా లేదా జీసెస్ లడ్డా అనే శీర్షికతో వాట్సాప్‌లో ఒక సమాచారం విస్తృతంగా ప్రచారం జరిగింది. టీటీడీ దీనిని వెంటనే అవాస్తవ సమాచారమని ఖండించింది. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వాట్సాప్‌లో ఈ సమాచారాన్ని పంపించినవారిపై సీఆర్ నెంబర్ 2/2020 యు/ఎస్ 500, 505(2) ఐపీసీ కింద కేసులు నమోదైంది. దీనిపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.