క్రైమ్/లీగల్

మద్యం మత్తులో ఎస్‌ఐని కారుతో ఢీకొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 2: మద్యం మత్తులో ఎస్‌ఐని కారుతో యువకులు ఢీకొట్టిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నవాబుపేట్ ఎస్‌ఐ శ్రీకృష్ణ విధి నిర్వహణలో భాగంగా గురువారం తెల్లవారుఝామున అనంతగిరి నందిఘాట్ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్నారు.నలుగురు యువకులు మద్యం మత్తులో వికారాబాద్ వైపు నుంచి కేరెళ్లి వైపు అతివేగంతో వచ్చారు. పోలీసులు ఆపినా.. కారు నిలపకుండా వాహనాల తనిఖీ చేస్తున్న ఎస్‌ఐని ఢీకొట్టారు. తీవ్ర గాయాలైన ఎస్‌ఐ శ్రీకృష్ణను నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.