క్రైమ్/లీగల్

ముగ్గురు ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ తీవ్రవాదుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తలా, జనవరి 2: నిషేధిత నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ)కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఉత్తర త్రిపుర జిల్లా పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పానిసాగర్ రైల్వే స్టేషన్‌లో సోదాలు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను, పలు డాక్యుమెంట్లు, ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నట్లు గురువారం ఉత్తర త్రిపుర జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ భానుపద చక్రవర్తి తెలిపారు. ఇద్దరు మిలిటెంట్లను విచారించగా వారి సమాచారం మేరకు ధర్మానగర్ రైల్వే స్టేషన్‌లో సోదాలు నిర్వహించి మరో ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ‘9ఎంఎం పిస్టోల్‌ను, ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లు, బ్యాంకు పాస్ పుస్తకాలు మరిన్ని డాక్యుమెంట్లను వీరి నుంచి స్వాధీనం చేసుకొన్నాం’ అని ఎస్పీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు ముగ్గురిపై రాజద్రోహ, దోపిడీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం వంటి అంశాలపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత నెల 18న త్రిపుర ఎంపీ రేవతి మోహన్‌కు పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేయడంపై ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ ‘బెదిరింపు నోటీసు’ను జారీ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ సెక్రటరీ జనరల్ డీ. ఓంతాయ్ పేరు మీద ఈ బెదిరింపు నోటీసులు జారీ అయినట్లు పోలీసు అధికారి స్పష్టం చేశారు. ఎన్‌ఎల్‌ఎఫ్‌టీ సంస్థపై 1997లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం, తరువాత పోటా చట్టం కింద ఈ సంస్థపై నిషేధం విధించారు.