క్రైమ్/లీగల్

గుట్కా @ కర్ణాటక టు మహబూబాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, నవంబర్ 12: కర్ణాటకలోని బీదర్ పట్టణం నుండి మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వం నిషేధించిన గుట్కా రవాణా చేస్తున్న ఇద్దరిని సోమవారం జనగామ చౌరస్తా లో వరంగల్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారినుండి పెద్ద ఎత్తున రూ.23.85 లక్షల విలువచేసే 19 బస్తాల అంబర్ గుట్కా ప్యాకెట్లు, ఒక బస్తా మీరజ్ అంబర్ గుట్కా కలిగిన వాటితోపాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ఎపి-28, టిడి 1136 నెంబర్‌గల ఇన్నోవా కార్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ జి.చక్రవర్తి అరెస్టుకు సంబంధించి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండ లం, చిల్లచెర్లకి చెందిన అనంతుల వీరన్న, యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన గంజి నరేష్‌రెడ్డి ఇద్దరు స్నేహితులు. అతి తక్కువ సమయంలో సులువుగా భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలనే దురాశతో ప్రభు త్వం నిషేధించిన గుట్కా వ్యాపారం చేయుటకు సిద్దమయ్యారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు గత సంవత్సరం హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకోవడంతోపాటు గుట్కా రవాణాకు ఇన్నోవా కార్‌ను కోనుగోలు చేసారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో అతి తక్కువ ధరకు అంబర్ గుట్కా ప్యాకెట్లు కోనుగోలు చేసి, మహబూబాబద్ జిల్లా కేంద్రంతోపాటు తొర్రూరు, మరిపెడ గ్రామాలలోని కిరాణం, పాన్‌షాప్ వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో బీదర్‌నుండి జనగామా మీదుగా మహబూబాబాద్‌కు గుట్కా రవాణా చేస్తున్నట్లు ఆదివారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఏసీపీ చక్రవర్థి ఆదేశాల మేరకు సిఐ నందిరా మ్ నాయక్, సిబ్బంది శ్యాంసుందర్, శ్రీకాంత్, రంజిత్, మహేందర్, రాజేష్ తదితరులు అర్ధరాత్రి జనగామా చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానస్పద స్థితిలో కనిపించిన ఇన్నోవా కార్‌ను నడుపుతున్న డ్రైవర్ పోలీసులను చూసి ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని నిలిపివేసారు. వెంటనే కార్ లో తనిఖీ చేయగా అంబర్ గుట్కా ప్యాకెట్లు లభించడంతో వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. తదుపరి చర్యల నిమిత్తం స్థానిక జనగామ పట్టణ పోలీసులకు అప్పగించారు.