క్రైమ్/లీగల్

సుజాతనగర్ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 12: సుజాతనగర్ చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 లక్షల విలువైన చీరలు పట్టుబడ్డాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరలు తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి రవాణా శాఖ అధికారికి పంపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన మధుసూదన్‌రావు చీరల వ్యాపారి. వారణాసి నుంచి చీరలు కొనుగోలు చేశానని, జిఎస్టీ సైతం చెల్లించినట్లు వ్యాపారి వాపోయాడు

ఉరి వేసుకొని వలస కార్మికుడి ఆత్మహత్య

పాల్వంచ, నవంబర్ 12: ఉరి వేసుకుని ఒక వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం పాల్వంచలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం జాగుర్ బిలాస్పూర్ జిల్లా, రంతల గ్రామానికి చెందిన అనీల్ సూర్యవంశి (22), నాలుగు నెలల క్రితం కూలి పని కోసం స్థానిక కెటిపిఎస్ 7వ దశ కర్మాగారంలోని ఆర్‌ఆర్ ఇంజనీర్స్ వద్ద పెయింటింగ్ పని చేసేందుకు చేరాడు. దీపావళి పండగ సందర్భంగా అనీల్ వారం రోజుల క్రితం తన గ్రామానికి వెళ్లాడు. తిరిగి ఆదివారం పట్టణంలోని ఒడ్డుగూడెంలో తన గదికి చేరుకున్నాడు. గదిలో అనీల్‌తో ఉంటున్న తోటి కార్మికులు ఇద్దరు ఆదివారం మరొక కార్మికుడి రూమ్‌కి వెళ్లారు. అనీల్ గదిలో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు అందుబాటులో లేకపోవడంతో అనీల్ మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.