క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, నవంబర్ 19: ఉరవకొండ శివారు ప్రాంతంలోని అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉరవకొండకు చెందిన మేఘనాథ్(40) ఉరవకొండ నుండి బూదగవికి నడుచుకుంటూ వెళుతుండగా అనంతపురం నుండి బళ్లారికి వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జనార్ధన్‌నాయుడు తెలిపారు.

ముంబై వ్యక్తి హంద్రీనీవా కాలవ లిఫ్ట్‌లో శవమై తేలాడు

వజ్రకరూర్, నవంబర్ 19: హంద్రీనీవా సుజల స్రవంతి కాలవ రాగులపాడు లిఫ్ట్ నీటిలో ముంబైకి చెందిన ఆల్పేస్ రాథోడ్ (25) అనే వ్యక్తి శవమై సోమవారం తేలాడు. వజ్రకరూరు మండలం ఎస్‌ఐ ఇబ్రహీం వివరాల మేరకు ముంబైకి చెందిన భక్త్ రాథోడ్ కుమారుడు ఆల్పేస్ రాథోడ్ మహారాష్టల్రోని బారోం జిల్లా కేంద్రంలో మిత్రులతో కలసి రైలు ఎక్కాడు. ముంబై నుండి మంత్రాలయం వెళ్లి అక్కడ దర్శనానంతరం ఈ నెల 11న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో తప్పిపోయి ఏకంగా ఈరోజు శవమై కనిపించాడు. అతని ప్యాంటులో సెల్‌ఫోన్‌లో సిమ్ము తీసుకుని చిరునామా కనుక్కుని ముంబైలోనున్న బంధువులకు తెలియజేశారు. హంద్రీనీవా, పోలీస్ సిబ్బంది దాదాపు ఆరు గంటలు నీటిలో గాలించి శవాన్ని వెలికి తీశారు. అనంతరం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ముంబై నుండి బంధువులు వచ్చిన వెంటనే శవాన్ని అప్పగిస్తామన్నారు.

నకిలీ చెక్కు కేసులో ఇద్దరి అరెస్టు
* రూ.1.50 లక్షలు రికవరీ
అనంతపురం, నవంబర్ 19: నకలీ చెక్కును మార్చి బ్యాంకును మోసం చేసిన కేసులో ఇద్దరి వ్యక్తులను 4వ పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకట్రావు విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ముద్దాయిలు నగరంలోని పాతవూరు ఉమానగర్‌కు చెందిన చిలకల లాల్‌బాషా, గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఉదయ్, బెంగుళూరుకు చెందిన నాగిరెడ్డి. ఈ నేరం 2017 జూలై 26న జరిగినట్లు వెల్లడించారు. సూరత్‌కు చెందిన ఉదయ్‌కు, బెంగళూరుకు చెందిన నాగిరెడ్డితో పరిచయం కావడంతో వారి మధ్య స్నేహమేర్పడింది. ఈక్రమంలో ఎమ్‌ఆర్ మొబైల్ కేర్ గుజరాత్‌కు చెందిన రూ.9.28 లక్షల నకిలీ చెక్కును నాగిరెడ్డికి ఇచ్చి, దీనిని మారిస్తే కొంత కమీషన్ ఇస్తానని ఉదయ్ చెప్పాడు. ఇందుకు అంగీకరించిన నాగిరెడ్డి పాతూరుకి చెందిన చిలకల లాల్‌బాషాతో కలసి నకిలీ చెక్కును తపోవనం స్టేట్ బ్యాంక్‌లో చెక్కును మార్చి తనకు తెలిసిన వారి అకౌంట్‌లోకి రూ.7.28 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని లాల్ బాషా లక్షా 99 వేలును డ్రా చేసుకున్నాడు. అంతలోనే హాజీపురా స్టేట్ బ్యాంక్ మేనేజర్ తపోవనం బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి సదరు చెక్కు నకిలీదని చెప్పగా, బ్యాంక్ మేనేజర్ ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయిన మొత్తాన్ని మరలా రిటర్న్ చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుపై 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, 19వ తేదీన ముద్దాయిలను అరెస్ట్ చేసి, వారి నుండి రూ.1.50 లక్షలు రికవరీ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.