క్రైమ్/లీగల్

కాల్వలో పడి చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, నవంబర్ 19:మండల పరిధిలోని క్రిష్ణాపురం గ్రామ సమీపంలో ఉన్న జీడీపీ కాల్వలో ప్రమాదవశాత్తూ పడి ఆదివారం సాయంత్రం హరిజన జాను(3) మృతిచెందాడు. ఈ విషయం తెలియక రాత్రి పొద్దుపోయే సమయంలో పిల్లవాడు కనిపించడం లేదని తల్లీదండ్రులు హరిజన దుబ్బన్న, సోని గ్రామంలో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం కాల్వలో తేలిన జాను మృతదేహం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

తుగ్గలి, నవంబర్ 19:మండల పరిధిలోని జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. చెరువుతండా బస్టాండ్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించినట్లు జొన్నగిరి ఏఎస్‌ఐ చెన్నకేశవ తెలిపారు. ఎర్రగుడి వీఆర్‌ఓ మల్లికార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని, మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 48 సంవత్సరాలు ఉండవచ్చని ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

బనగానపల్లె, నవంబర్ 19:స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుపుల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి(32) మృతి చెందినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్ సోమవారం తెలిపారు. రాజ్యలక్ష్మి, ఆమె భర్త వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై యాగంటికి వెళ్లి తిరిగి వారి స్వగ్రామం వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రాజ్యలక్ష్మిని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.