క్రైమ్/లీగల్

సీఎస్‌పీఏ సంస్థ ప్రతినిధులపై జనసేన దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిఠాపురం, సెప్టెంబర్ 10: పిఠాపురంలో జనసేన కార్యకర్తల అత్యుత్సాహం కాస్తా రాజకీయ సర్వే చేస్తున్న ప్రతినిధులపై దాడికి దారి తీసింది. గ్రామాల్లో సర్వేచేస్తున్న వారిని అక్రమంగా నిర్భందించి, దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు జనసేన కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బెంగుళూరుకు చెందిన సెంటర్ ఫర్ సోషియో పోలిటికల్ ఎనాలసీస్ (సీఎస్‌పీఏ)అనే సంస్థ ప్రతినిధులు సుకేశ్‌హిజాక్ (బాపట్ల), శివకుమార్ (అనంతపురం), గోపికృష్ణ (కర్నూలు), కె భానుప్రకాష్ (అనంతరంపురం), ముప్పిడి మణికంఠస్వామి (రాపర్తి) ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నారు. ఇదే క్రమంలో పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో సర్వే నిమిత్తం సోమవారం బృందం సభ్యులు ఇద్దరు వెళ్లారు. బూత్‌లో ఉన్న ఓటర్లలో కనీసం 25 మంది అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఊటా నానిబాబు అనే వ్యక్తికి అనుమానం వచ్చి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు..మా ఊళ్లో ఓట్లు తొలగించేస్తున్నారంటూ వాదనకు దిగాడు. సర్వే బృందం సభ్యులు సర్థి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. వారిని గ్రామస్థుల సహకారంతో నిలువరించి పిఠాపురంలో ఉన్న జనసేన నాయకులు బాలిపల్లి రాంబాబు, కర్నీడి శ్రీనుకు సమాచారం ఇచ్చి, బృందం సభ్యులను పిఠాపురం రాజాకోటలోనికి తీసుకొచ్చారు. అనంతరం వారిని రాజాకోటలోనే నిర్భంధించి, సెల్‌ఫోన్లు లాక్కుని, దాడిచేసి నిజం చెప్పాలంటూ బెదిరించారు. సర్వే బృందం సభ్యులు తాము ఓట్లు తొలగించేవారం కాదని, అర్థం చేసుకోవాలని చెప్పినప్పటికీ జనసేన కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి వారిని కొట్టారు. మణికంఠ అనే జనసేన కార్యకర్త వీడియోలు తీసి మొత్తం వ్యవహారాన్ని ఫేస్ బుక్‌లోపెట్టాడు. ఇంతలో సమాచారం తెలుసుకున్న ఎస్సై శోభన్‌కుమార్ రాజాకోటలోకి వెళ్లి పూర్తి వివరాలను సేకరించారు. సర్వే బృందంతోపాటు, జనసేన కార్యకర్తలను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈలోగా ఆ సంస్థ ప్రధాన అధికారులు రాష్టస్థ్రాయి పోలీసు అధికారులకు ఫిర్యాదుచేయడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో కాకినాడ డీఎస్పీ రవివర్మ హుటాహుటినా పిఠాపురం చేరుకున్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేశారు. సర్వే సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సర్వే సంస్థ ప్రతినిధులపై దాడిచేసిన బాలిపల్లి రాంబాబు, కర్నీడి శ్రీను, ఊటా నానిబాబు, మణికంఠలపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టాన్ని ఎవరూ చేతుల్లో తీసుకోకూడదని, సమస్య వస్తే అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే సంస్థ బోగస్ కాదని, పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే ఘటనపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. జనసేన నాయకులు అనిశెట్టి సుబ్బారావు, శెట్టిబత్తుల రాజాబాబు తదితరులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై సీఐ అప్పారావుతో చర్చించారు. సర్వే బృందం ప్రతినిధులతో రాజీదిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రాజమహేంద్రవరం బంద్‌లో అపశృతి సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ చేతికి తీవ్ర గాయం

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 10: రాజమహేంద్రవరంలో పెట్రో ధరలకు నిరసనగా నిర్వహించిన బంద్ నేపధ్యంలో సోమవారం అపశృతి చోటు చేసుకుంది. స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్‌లో ఎద్దుల బండిపై వినూత్న నిరసనకు దిగిన నేపధ్యంలో సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్‌కు చేతికి తీవ్ర గాయమైంది. సీపీఐ నాయకుడు నల్లా రామారావు, జనసేన నాయకులు కందుల దుర్గేష్, వై శ్రీనివాసరావు తదితర నాయకులు ఎడ్ల బండి ఎక్కుతున్న సమయంలో బండి కదిలిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయిన క్రమంలో అడుగున ఉండిపోయిన సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఎడమ చేతికి తీవ్ర గాయం అయింది. ఎక్స్‌రే తీయడంతో చేయి విరిగినట్టు నిర్ధారించారు. దీంతో హుటాహుటిన ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.