క్రైమ్/లీగల్

15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, సెప్టెంబర్ 10: పౌర సరఫరా, రెవిన్యూ శాఖాధికారులు శనివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించి పెనుగొండ మునసుబుగారి వీధిలోని చేకూరి శ్రీనివాసరావు ఇంటి ఆవరణలో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తహసీల్దార్ బొడ్డు శ్రీనివాసరావు తెలిపారు. కార్డుదారులకు అధిక ధర చెల్లించి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి తిరిగి అధిక ధరలకు బయట విక్రయిస్తున్నట్టు శ్రీనివాసరావు అంగీకరించడంతో కేసు నమోదు చేశామన్నారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సమీప డీలర్‌కు అప్పగించామన్నారు. తనిఖీల్లో జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి యాతం ప్రతాపరెడ్డి, ఆర్‌ఐ కళ్యాణి, వీఆర్వో పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.