క్రైమ్/లీగల్

42.3 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, సెప్టెంబర్ 10: పట్టణంలోని గౌతంనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిపిన సోదాలలో 42.3 కిలోల గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సంగారెడ్డి ఎక్సైజ్ ట్రాస్క్ఫోర్సు అధికారులు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిపిన దాడులలో భారీగా గంజాయి పట్టుబడగా ఇద్దరు నిందితులు పరారయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను పటన్‌చెరు ఎక్సైజ్ అధికారులు తెలియచేసిన ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్య, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్‌గౌడ్‌లు స్థానిక ఎక్సైజ్ అధికారులతో కలిసి పట్టణంలో దాడులు జరిపారు. స్థానిక గౌతంనగర్‌కాలనీలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా సుమారు 42.3 కిలోల గంజాయి పట్టుబడింది. సదరు రూంలో గంజాయి దాచిన జాదవ్ మారుతి, అతనికి ఒరుసకు బావమరిది అయిన పాండులు పరారయ్యారు. గౌతంనగర్‌లో ఓరూంలో మత్తు మందు దాచిన వారిద్దరు అక్కడి నుండి తప్పుకున్నారు. మొత్తం ఎనిమిద బండిల్లు లభించగా ఒక్కో దానిలో 5.2 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి స్థానిక ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.