క్రైమ్/లీగల్

భూతగాదాల్లో ఘర్షణ.. వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునగాల, సెప్టెంబర్ 10: భూతగాదాల్లో జరిగిన ఘర్షణ వ్యక్తి మృతికి దారితీసిన సంఘటన మండల పరిధిలోని బరాఖత్‌గూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎస్‌కే మల్సూర్, ఎస్‌కే. దస్తగిరి, ఎస్‌కే. టెంటూసాహెబ్‌లు స్వయాన అన్నదమ్ములు. కాగా దస్తగిరి తన కూతురు సహేరా వివాహ నిమిత్తమై తన 30 సెంట్ల వ్యవసాయ భూమిని తన అన్న మల్సూర్‌కు విక్రయించాడు. అమ్మిన భూమికి సంబంధించిన డబ్బు మల్సూర్ పూర్తిగా చెల్లించకపోవడంతో దస్తగిరి కుమారుడు షరీఫ్ ఆదివారం రాత్రి మద్యం మత్తులో మల్సూరుతో వాగ్వాదానికి దిగాడు. గమనించిన షరీఫ్ బాబాయి టెంటూసాహెబ్ (40) వివాదాన్ని వారించబోగా అడ్డొచ్చిన టెంటూసాబ్‌ను షరీఫ్ చితకబాదాడు. జరిగిన విషయాన్ని షరీఫ్ తన తండ్రి దస్తగిరితో చెప్పగా ఆవేశపడ్డ దస్తగిరి తన అల్లుడు ఎస్‌కే మీరాతో కలసి టెంటూసాబ్ ఇంటికి వెళ్లి అతడిని మరలా కొట్టడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. సోమవారం వేకువజామున చికిత్స నిమిత్తమై కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య జాన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ శివశంకర్‌గౌడ్ తెలిపారు. కాగా మృతదేహానికి కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఘర్షణలో మృతిచెందిన విషయాన్ని తెలసుకున్న కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.