క్రైమ్/లీగల్

ఎనిమిది మందిపై పీడీ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 10: గత నెల రోజులుగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు వ్యభిచార గృహాలలో ముస్కాన్ ఆపరేషన్‌తో వ్యభిచార నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించి అక్రమంగా వ్యభిచారం నిర్వహిస్తూ బాలికలను వ్యభిచార వృత్తిలోకి దింపుతుప్ప 8 మందిపై పీడీ చట్టం నమోదు చేసినట్లు భువనగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మైనర్ బాలికలను ఇతర ప్రాంతాల నుండి అక్రమంగా కొనుగోలు చేసి వారిని పోషిస్తూ బాలికలను తమ పిల్లలుగా ఆధార్‌కార్డులను సైతం సృష్టించి బాలికల ఎదుగుదలకు ఎంజెక్షన్స్ ఇచ్చి వ్యభిచా కూపంలోకి దింపుతున్న వారిని పక్కా సమాచారంలో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. గతంలో కూడా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినా, కౌన్సిలింగ్‌లు ఏర్పాటు చేసినా వారి ప్రవర్తనలో మార్పులు రావడంలేదని మళ్లీ అదే వ్యభిచార వృత్తిని చేస్తున్నారని తెలిపారు. ఇతర ప్రాంతాల నుండి కంసాని శంకర్ రూ.40 వేలు, రూ.50 వేలకు బాలికలను గుట్టలో వ్యభిచార గృహాలలో అమ్మేవారని వ్యభిచార నిర్వాహకులు వీరిచే బలవంతంగా వ్యభిచారంలోకి దింపేవారని అందుకే 8 మందిపై పీడీ చట్టం నమోదు చేశామన్నారు. పీడీ చట్టం నమోదైన వారిలో కంసాని సరిత, కంసాని వంశీ, కంసాని నరేష్, కంసాని స్వప్న, కంసాని కుమారి, కంసాని ఎల్లయ్య, కంసాని జమున, కంసాని కృష్ణవేణి ఉన్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19 మందిపై పీడీ చట్టం నమోదు జరిగిందని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. ఇంకొందరిపై కూడా పీడీ చట్టం నమోదు చేయడంతోపాటు వ్యభిచార గృహాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుట్టలో వ్యభిచార నిర్మూలన అయ్యేంత వరకు ఆపరేషన్ ముస్కాన్ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాసాచార్యులు, రూరల్ సీఐ ఆంజనేయులు, టౌన్ సీఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు.