క్రైమ్/లీగల్

ఈచర్, ట్రాక్టర్ ఢీ - 11 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాపురం, సెప్టెంబర్ 10: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం నల్లగుట్టపల్లె పంచాయతీ బీసీ కాలనీ సమీపంలోని శివాలయం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రామాపురం మండలం నల్లగుట్టపల్లె పంచాయతీ బీసీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు, పెంచలమ్మ, చిన్నసుబ్బరాయుడు, రామాంజులు, లక్ష్మిదేవి, నాగేంద్ర, బాలపెంచలయ్య, నరసింహులు, సుబ్బరాయుడు, వెంకటరమణలు కంకరపని కోసం బీసీ కాలనీ నుంచి మేదరపల్లెకు ట్రాక్టర్‌లో వెళ్తుండగా శివాలయం వద్దకు రాగానే వెనుకవైపు నుంచి రాయచోటివైపు నుంచి కడప వైపు వెళ్తున్న టమోటా ఐచర్ లారీ ఢీకొంది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తన్న 11 మందికి తీవ్ర గాయాలు కాగా లారీలో కూలి పనికి వెళ్తున్న కర్ణాటకకు చెందిన వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. సంఘటన స్థలానికి మాజీ సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణరెడ్డి, వైఎస్ ఆర్‌సీపీ రాష్ట్ర యువ నాయకుడు సూరం వెంకటసుబ్బారెడ్డి, గ్రామస్థులు, రామాపురం పోలీసులు చేరుకొని తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తమై సొంత వాహనాల్లో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుబ్బరాయుడు, వెంకటరమణ, బాలపెంచలయ్య, నరసింహులును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రమాద బాధితులను ఆసుపత్రిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డిలు పరామర్శించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు.