క్రైమ్/లీగల్

బ్యాంక్‌లో చోరీకి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, సెప్టెంబర్ 10: బ్యాంక్‌లో చోరీకి యత్నించిన వ్యక్తిని పోలీస్‌లు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కధనం ప్రకారం కోల్‌కత్తాకు చెందిన హరికృష్ణ దేబానత్ (21) గత మూడు సంవత్సరాలుగా నాచారంలో నివాసం ఉంటూ, అక్కడే గోల్కొండ మిషనరీస్‌లో మిషన్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కంపెనీకి సంబంధించిన మనీ లావాదేవీలను మల్లాపూర్‌లోని ఏస్‌బీఐ బ్యాంక్‌లో నిర్వహించేవారు. నిత్యం బ్యాంక్‌కు వెళ్లే హరికృష్ణ లాకర్ ఎక్కడ ఉండేది తెలుసుకొని ఏలాగైనా దొంగతనం చేసి డబ్బులు కాజేయాలని పథకం వేశాడు. బ్యాంక్ వెనుక నుంచి కన్నం వేసి లోనికి ప్రవేశించాడు. బ్యాంక్ ఏటీఏం లోని సీసీ కెమెరాలను, మిషీన్‌ను ధ్వంసం చేశాడు. లాకర్ తీసే ప్రయత్నం చేయగా ఎంతకూ లాకర్ తెరుచుకోక పోవటంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. 20వ తేదీ బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసేసరికి సీసీ కెమెరాలు ఏటీఎం ధ్వంసం కావటం చూసి బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్ నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్‌కు చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాల్లో హరికృష్ణ అనుమానాస్పదంగా కన్పించటంతో పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు రాబట్టారు.