క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, సెప్టెంబర్ 10: విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ పాత బస్తీలో నివసిస్తున్న విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఆర్.వెంకటరమణ (38) కూలీ. అతడు సోమవారం బోడుప్పల్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై కర్ర లేపుతుండగా ప్రమాదశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లకు తాకి విద్యుత్ షాక్ తగిలింది. కింద పడి తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంవల్ల మరణించాడని, నష్టపరిహారం ఇవ్వాలని మృతుడి కుటుంబ సభ్యులు, బస్తీ ప్రజలు ఆందోళన చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.